ఎన్నిక‌ల వేళ విషాదం.. బీఆర్ఎస్ నాయ‌కుడు మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ, చిలుకూరు : మండ‌ల వ్యాప్తంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్న త‌రుణంలో చిలుకూరులో మాత్రం విషాదం చోటు

ఎన్నిక‌ల వేళ విషాదం.. బీఆర్ఎస్ నాయ‌కుడు మృతి
X

దిశ, చిలుకూరు : మండ‌ల వ్యాప్తంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్న త‌రుణంలో చిలుకూరులో మాత్రం విషాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు మృతితో విషాదం నెలకొంది. చిలుకూరుకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, డీఎల్డీఏ నల్లగొండ జిల్లా మాజీ డైరెక్టర్, చిలుకూరు మండల ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కస్తూరి నరసయ్య (72) అనారోగ్య కారణాలతో కోదాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. మండలంలో సుపరిచితుడైన నరసయ్య మృతితో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Next Story