చేపల వేటకు వెళ్తూ అనంత లోకాలకు

by Bhanu |

చేపల వేటకు వెళ్తూ అనంత లోకాలకు
X

దిశ,మాడుగులపల్లి: మాడుగులపల్లి మండల కేంద్రం శివారులోని భారత్ పెట్రోల్ బంకు దగ్గర బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ట్రాక్టర్ ను బొలెరో వాహనం ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మాడుగులపల్లి ఎస్సై ఎస్ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం రుద్రారం గ్రామానికి చెందినవారు దాచారం చెరువులో చేపలు పట్టడానికి ట్రాక్టర్ ఫై వెళ్తుండగా మిర్యాలగూడ వైపు నుండి వేగంగా వస్తున్న బొలెరో వాహనం ట్రాక్టర్ ను వెనుక నుండి ఢీ కొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ వీరయ్య,ట్రాక్టర్లో ఉన్న నల్లగంతుల రామయ్యకు బలమైన గాయాలయ్యాయి.వారిని నలగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నల్లగంతుల రామయ్య మృతి చెందాడు. మృతుని భార్య నాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు.



Next Story