తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి

by Bhanu |

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందాడు.

తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి
X

దిశ, రామన్నపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన ఎర్ర తిరుమల్లేష్ (41) అనే గీత కార్మికుడు తాటికల్లు గీసి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రోజు మాదిరిగానే బుధవారం సాయంత్రం తాటి చెట్లు ఎక్కి కళ్ళు తీయడానికి వెళ్లిన మల్లేష్ ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కిందపడ్డారు.

వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు తిరుమలేష్ మృతదేహం పై పడి కన్నీరుగా మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్సిగ్రేషియా అందించి కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలని గీతపనివారల సంఘం నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, వెంట గంగాపురం వెంకటయ్య, బాలగోని మల్లయ్య, ఎర్ర బిక్షపతి కోరారు.




Next Story