ఇరవై ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇళ్ల స్థలాల పంపిణీతో పేదల కళ్ళలో ఆనందం

by Bhanu |

ఇరవై ఏళ్ల నిరీక్షణకు తెర పడింది. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి హోం మంత్రిగా పనిచేసిన కాలంలో పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేసినందుకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ప్రభుత్వ భూములు ఇప్పటివరకు పేదలకు పంచకపోవడంతో ఆ పేదలు ఇన్ని సంవత్సరాలు నిరీక్షణగా ఎదురు చూశారు.

ఇరవై ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇళ్ల స్థలాల పంపిణీతో పేదల కళ్ళలో ఆనందం
X

దిశ, తిరుమలగిరి (సాగర్) : ఇరవై ఏళ్ల నిరీక్షణకు తెర పడింది. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి హోం మంత్రిగా పనిచేసిన కాలంలో పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేసినందుకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ప్రభుత్వ భూములు ఇప్పటివరకు పేదలకు పంచకపోవడంతో ఆ పేదలు ఇన్ని సంవత్సరాలు నిరీక్షణగా ఎదురు చూశారు. గత 10 సంవత్సరాలు పాలన చేసిన బిఆర్ఎస్ పార్టీ ఆ ఇంటి స్థలాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇంటి స్థలాల విషయం మరుగున పడింది. జానారెడ్డి తనయులు ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో నియోజకవర్గం వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న పనుల పై ఫోకస్ పెట్టారు. వాటిని వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే మండలంలోని చిలకాపురం గ్రామంలో 121 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయగా.. బోయగూడెం,ఎల్లపురం తండాలో ఇంటి స్థలాల పంపిణీకి సిద్ధంగా ఉంది. అల్వాల లో ఇంటి స్థలాల పంపిణీకి భూమిని సిద్ధం చేయాలన్నారు.

మంగళవారం కొంపెల్లి గ్రామంలోని 261 సర్వే నెంబర్లో గల నాలుగు ఎకరాల 18 గుంటల ప్రభుత్వ భూమిలో 172 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల పంపిణీలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షమే ఉందన్నారు. ప్రతి సంక్షేమ పథకాని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. సంక్షేమ పథకాలను సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. పది సంవత్సరాల పాలనలో నియోజకవర్గంలో ఒక్క ఇంటి నిర్మాణం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టలేదన్నారు. జానారెడ్డి హయాంలో 33,000 ఇళ్ళు నిర్మిస్తే.. గత ప్రభుత్వం నియోజకవర్గంలో మూడు ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. 3,500 ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి ఇప్పటికే మంజూరు చేశామన్నారు. ఎవ్వరు అదెర్య పడొద్దు అని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడుతాం అన్నారు.

త్వరలో రాష్ట్ర మొత్తం మరల తిరుమలగిరి (సాగర్) మండలం వైపు చూస్తుందన్నారు. బహిరంగ సభను ఏర్పాటు సీఎం చేతుల మీదుగా భూమి పంపిణీ పట్టాలు అందించబోతున్నామన్నారు. త్వరలో ఎల్లాపురం తండా, బోయగూడం గ్రామాలలో పేదలకు ఇంటి స్థలాలను పంపిణీ చేస్తామన్నారు. అల్వాల ఎక్స్ రోడ్డు నుండి ముకుందాపురం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం త్వరలో ప్రారంభం అవుతుందన్నారు.ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో మా వెంట ఉన్న నాయకులకు, తమకు సహకరించిన మీ గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్,గడ్డం సాగర్ రెడ్డి, ఎమ్మార్వో అనిల్, గాలి చంద్రకళ, చిట్టి, నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు

Next Story