పేద కుటుంబంలోని వ్యక్తిని వరించిన మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

by Naveena |

పీఏ పల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన గడిగ బాలకృష్ణ ఇటీవల ప్రకటించిన పరీక్ష ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచాడు.

పేద కుటుంబంలోని వ్యక్తిని వరించిన మూడు ప్రభుత్వ ఉద్యోగాలు
X

దిశ, చింతపల్లి : పీఏ పల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన గడిగ బాలకృష్ణ ఇటీవల ప్రకటించిన పరీక్ష ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచాడు. గ్రూపు1లో 400 మార్కులు సాధించగా.. గ్రూప్-2 లో 371 మార్కులతో 442 ర్యాంకును సాధించాడు. గ్రూప్ 3 నందు రాష్ట్రస్థాయిలో 285 మార్కులతో 381 ర్యాంకును సాధించారు. ప్రస్తుతం చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో గ్రూప్ 4 నందు ఎంపిక అవడం జరిగింది. అందుకు వారి మిత్రులు అంజి కానిస్టేబుల్ పోలే రవి, పవన్,శేఖర్, యశ్వంత్, సతీష్,రాజేష్, శ్రీనివాస చారి, తదితరులు అతనిని అభినందించారు.

Next Story