విద్యలో రాణించే వారిని ప్రోత్సహిస్తా : ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ, తుంగతుర్తి : విద్యలో రాణించే ప్రతి ఒక్కరిని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తానని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి పేర్కొన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన తెలంగాణ ఉద్యమకారులు

విద్యలో రాణించే వారిని ప్రోత్సహిస్తా : ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి
X

దిశ, తుంగతుర్తి : విద్యలో రాణించే ప్రతి ఒక్కరిని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తానని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి పేర్కొన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన తెలంగాణ ఉద్యమకారులు, సమాజ సేవకులైన కీ.శే ఓరుగంటి సత్యనారాయణ సంవ‌త్స‌రికం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యతోనే ప్రతి ఒక్క అంశం ముడిపడి ఉందని అన్నారు. అందుకే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థులందరికీ అండగా నిలుస్తున్నట్లు ప్రకటించారు. సత్యనారాయణ జీవించినంత కాలం సమాజసేవే లక్ష్యంగా ముందుకు సాగేవారని గుర్తు చేశారు. అంతకుముందు ఆయన చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి నివాళులు అర్పించారు. లయన్స్ క్లబ్ మండల అధ్యక్షులు సంతోష్, తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, మాజీ చైర్మన్ పులుసు యాదగిరి, దేవాలయ కమిటీ చైర్మన్ సంజీవ పాల్గొన్నారు.

Next Story