ఈ ఉగాది నా జీవితంలో మర్చిపోలేనిది

by Naveena |   (  Updated:2025-03-30 13:27:42  IST  )

ఈ ఉగాది నాకు కొత్త ఆలోచనలు కలిగించడంతోపాటు చట్టసభలకు తొలి అడుగులు వేయించడం జీవితంలో మర్చిపోలేనిదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు

ఈ ఉగాది నా జీవితంలో మర్చిపోలేనిది
X

దిశ,తుంగతుర్తి: ఈ ఉగాది నాకు కొత్త ఆలోచనలు కలిగించడంతోపాటు చట్టసభలకు తొలి అడుగులు వేయించడం జీవితంలో మర్చిపోలేనిదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన "దిశ"కు ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక కొత్త ఒరవడితో కూడిన రాజనీతిని కొనసాగించడానికి ఒక మంచి అవకాశం తనకు ఈ రోజు దక్కిందని అన్నారు.పేదలు,పీడితులు అన్ని వర్గాల వారి సమస్యల పరిష్కారం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం తర్వాత అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ,సీఎం రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమం,క్యాబినెట్ పెద్దల తో పాటు ఏఐసీసీలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలని దయాకర్ పేర్కొన్నారు.ఉద్యమకారుడిగా,కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ముందుకు నడపడంతో పాటు తనపై చూపించిన ప్రేమకు,తనకు ఈ అవకాశం కలగడానికి కారకులైన ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు అని తెలిపారు.

Next Story