- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలోచించి ఓటు వేయండి...అభివృద్ధి చేసే వ్యక్తిని గెలిపించండి
అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారని కానీ ప్రజలు మాత్రం ఆలోచించి ..అభివృద్ధి చేసే వ్యక్తిని గెలిపించాలని హుజూర్ నగర్ ఎమ్మెల్యే, శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

దిశ, గరిడేపల్లి: అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారని కానీ ప్రజలు మాత్రం ఆలోచించి ..అభివృద్ధి చేసే వ్యక్తిని గెలిపించాలని హుజూర్ నగర్ ఎమ్మెల్యే, శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 కుటుంబాలు, హుజుర్ నగర్ మున్సిపాలిటీలోని గోవిందపురం 8వ వార్డు కౌన్సిలర్ చిలకబత్తిని సౌజన్య ఆధ్వర్యంలో 30 గంగిరెద్దుల కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి, ఎమ్మెల్యే సైదిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత 20సంవత్సరాల నుంచి పరిపాలించిన ప్రభుత్వాలు హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారని, కానీ తాను ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాత మూడున్నరెళ్ళలో నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపించానని అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలో జరిగిన నియోజకవర్గ స్థాయి గంగిరెద్దుల సామాజిక వర్గానికి చెందిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన న్యాయం చేస్తూ అందరిని అక్కున చేర్చుకుంది అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






