- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
హోలీ వేడుకల్లో ఈ పువ్వులే కీలకం..

దిశ,తుంగతుర్తి: “హోలీ”...ఈ మాట వింటేనే ప్రతి ఒక్కరిలో ఏదో ఉత్సాహవంతమైన అలజడి. మనసును తేలిక చేసే ఆరాటం. మోదుగు పూలతో ముడిపడిన ఈ పండుగ ఎప్పుడొస్తుందా...? ఎలా చేద్దామా...? అనే తరహాలో కార్యాచరణలు రూపొందించుకుంటారు. పకృతి సిద్ధపరంగా ఈ పూలతో రంగుల తయారీ ఒక చారిత్రాత్మకంగా ఉంటుంది. అంతేకాదు.. ఈ పండుగ వస్తుందంటేనే రెండు మూడు రోజుల ముందుగానే హోలీ రంగుల తయారీకి అంచనాలు జరుగుతుండేవి. మారుమూల పల్లెల్లో విరివిగా కనపడే మోదుగు చెట్లకు ప్రతి ఏటా ఫిబ్రవరి మొదటివారం నుండే ఈ పూలు పూయడం మొదలవుతుంది. హోలీ పండుగకు ముందు రోజే ఈ పూలను పలువురు సేకరించి కుండ లేదా బిందెలలో నీళ్లు పోసి ఉడికిస్తారు. అనంతరం అందులో తగినంత పసుపు,కుంకుమలు వేసి ఉడికిన తరువాత వడ కడతారు. ఎంతో అద్భుతంగా పకృతి సిద్ధపరంగా తయారైన రంగు నీళ్లను తమ వెంట తీసుకుని రోజంతా ఉల్లాసంగా...ఉత్సాహంగా ఆటాడేవారు. ఈ ఆటలు చిరస్థాయిగా నిలిచేయి. కానీ కాలానుగుణంగా పరిస్థితులన్నీ మారిపోయాయి. గ్రామాలలో మోదుగు చెట్ల పెరుగుదల కనుమరుగయింది. ఎక్కడో ఒకచోట కనపడే చెట్లకు పూల పూత తగ్గింది. ఫలితంగా ప్రజానీకం రసాయన రంగులపై
ఆధారపడ్డారు. ఎలాంటి శ్రమ లేని రంగుల తయారీతో హోలీ క్రీడల్లో పాల్గొంటూ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు