లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో చోరీ

by Bhanu |

వెల్లటూరు ఆర్‌అండ్‌ఆర్ సెంటర్‌లో నూతనంగా నిర్మించిన లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో అర్ధరాత్రి దొంగతనం కలకలం రేపింది

లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో చోరీ
X

దిశా ,మేళ్లచెరువు: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం వెల్లటూరు ఆర్‌అండ్‌ఆర్ సెంటర్‌లో నూతనంగా నిర్మించిన లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో అర్ధరాత్రి దొంగతనం కలకలం రేపింది. అమ్మవారి హుండీని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ ప్రజలంతా కలిసి సుమారు నవంబర్ 27న లక్ష్మీ తిరుపతమ్మ ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ఠను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నాడు ప్రతిష్ఠకు సంబంధించిన 16 రోజుల పండుగను శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అదే రోజు అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీని దొంగ తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల ఫుటేజ్‌లో స్పష్టంగా నమోదైంది. పండుగ ముగిసిన వెంటనే జరిగిన ఈ ఘటన భక్తులను, గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story