- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యువతి ఆత్మహత్మ.. సూసైడ్ కు ఆ విషయమే కారణమా..?
by Naveena |

X
దిశ, నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వన్ టౌన్ పోలీస్ స్టేసన్ పరిధిలోని మాన్యంచెల్కకు చెందిన కత్తుల మాధురి (26) బీటెక్ అయిపోగానే ఓ ప్రైవేట్ జాబ్ చేసి మానేసింది. ఈ మధ్యకాలంలోనే తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలని నిర్ణయించి, సబంధం కూడా ఖాయం చేశారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకులు, స్థానికులు గమనించి వెంటనే వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటినా సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ శంకర్ సిబ్బందితో ఘటనాస్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. అయితే పెళ్లి ఇష్టంలేకనే మాధురి ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
Next Story