- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికలలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం
ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని, ఎన్నికల నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని, ఎన్నికల నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మంగళవారం భువనగిరి మున్సిపాలిటీ లో పీఓ, ఏపీఓలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు. పీఓ, ఏపీ ఓ లు ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఇచ్చే మెటీరియల్, బ్యాలెట్ బాక్స్, ప్రిసైడింగ్ అధికారుల డైరీ, బ్యాలెట్ పేపర్ అకౌంటు, ఏజెంట్ల సమక్షం లోనే బ్యాలెట్ బాక్సులను తెరవడం వంటి అంశా లు వివరించారు. పోలింగ్ మెటీరియల్ ను జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలన్నారు. ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల విధుల పట్ల ఆర్ఓలు తమ బృందంలోని ఎన్నికల సిబ్బంది అందరికీ నియమ, నిబంధనల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని టీ పోల్ యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ రామలింగం, పీవో, ఏపీఓలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






