- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ గ్రామంలో సెల్ టవర్ నిల్.. ఫోన్లు ఫుల్
నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం, తిమ్మాపురం గ్రామంలో సెల్ ఫోన్ సిగ్నల్ లేక గ్రామస్తులు అవస్థ పడుతున్నారు.

దిశ, నేరేడుగొమ్ము : ప్రస్తుతం కంప్యూటర్ యుగం నడుస్తోంది. రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మొబైల్ రంగంలో 5 జీ ని వాడుతున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో అస్సలు సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడే వారు ఉన్నారు. ముఖ్యంగా ప్రతీ మనిషికి సెల్ ఫోన్ ఆయుధం అయింది. మనిషి భోజనం చేయకుండనైనా ఉంటుండు.. కానీ సెల్ ఫోన్ చూడకుండా మాత్రం ఉండలేకపోతుండు. ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్ అవసరం ఉంటుంది. ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. కానీ మారుమూల ప్రాంతం కాకపోయినప్పటికీ ఆ గ్రామంలో మొబైల్ సిగ్నల్ రావడం లేదు. నేరేడుగొమ్ము మండలానికి కూతవేటు దూరంలో ఉంది తిమ్మాపురం గ్రామం. ఆ గ్రామంలో మొబైల్ సిగ్నల్ ఉండదు.
సిగ్నల్ లేక అవస్థలు..
నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామంలో దాదాపు 2వేల జనాభా కలిగి ఉంటుంది. ఈ గ్రామంలో 1300 మంది ఓటర్లు ఉన్నారు. మండల కేంద్రం నుంచి పట్టణమైన దేవరకొండకు వెళ్లాలంటే తిమ్మాపురం గ్రామం మీదుగానే వెళ్లాలి. ఈ గ్రామంలో చదువుకున్న వారు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. ఈ గ్రామంలో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూపు 2, 3, 4, పంచాయతీ కార్యదర్శులు, సాప్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నారు. ఈ గ్రామానికి చెందిన వారు కొంత మంది హైదరాబాద్ నగరంలోని పలు ప్రైవేట్ కంపెనీలలో పని చేస్తుంటారు. ప్రతి ఇంటిలో డిగ్రీ, పీజీలు చేసిన వారు ఉన్నారు. కొంత మంది అయితే ఏకంగా పీహెచ్డీ కూడా చేశారు. ఈ పల్లెటూరులో ఉన్న ఊరు ప్రజలకు ఒకే ఒక్క ఇబ్బంది సెల్ ఫోన్ సిగ్నల్.. ఏ నెట్ వర్క్ అయినా ఈ గ్రామంలో అంతగా సిగ్నల్ ఉండదు. ఆ గ్రామంలో ఉన్న వారికి ఫోన్ చేయాలంటే ఫోన్ కి సిగ్నల్ రాదు. ఈ మొబైల్ నుంచి ఫోన్ పోదు. బీఎస్ఎన్ఎల్, ఐడియా, ఎయిర్ టెల్, జియో ఇలా ఏ నెట్ వర్క్ అయినా ఈ గ్రామంలో పని చేయదు.
ప్రభుత్వం పట్టించుకోవాలి
గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ ఊరి ప్రజలు ఇదే పరిస్థితి ఎదురుకుంటున్నారు. ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అయ్యే ఈ రోజుల్లో పిల్లలు ఆన్ లైన్ ద్వారా సెల్ ఫోన్ లో చూసి చదువుకోవాల్సిందే. అలాంటి ఈ ప్రపంచంలో ఏం జరిగిన సెల్ ఫోన్ ద్వారా సెకండ్ లో తెలుసుకుంటున్నారు. ప్రపంచం లో ఏ దేశంలో వారి బంధువులు ఉన్నా మంచి, చెడులు చరవాణి ద్వారా తెలుసు కుంటున్నారు. ఈ రోజుల్లో ప్రతి మనిషి సెల్ ఫోన్ ద్వారా ఎన్నోన్నో మంచి పనులు చేసుకుంటున్నారు. కానీ ఈ పల్లెటూరు లో మాత్రం సెల్ ఫోన్, నెట్ వర్క్ లేదంటే ఎంతో ఆశ్చర్యకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఉన్నది ప్రజా సమస్యలే అమలు పర్చాలి. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మా గ్రామాన్ని పట్టించుకొని నెట్ వర్క్ టవర్లు మంజూరు చేయించి గ్రామాన్ని అభివృద్ధి పథం లో నడిపించాలని గ్రామస్తులు కోరుచున్నారు.
స్వచ్ఛంద సంస్థలు, ధాతలు ముందుకు రావాలి : గ్రామస్తులు
ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు, ధాతలు మానవతదృపతంతో మారుమూల ప్రాంతమైన మా తిమ్మాపురం గ్రామాన్ని పట్టించుకొని సెల్ టవర్ ఏర్పాటు చేసి నెట్ వర్క్ వచ్చే విధంగా సహకరించాలని కోరుతున్నారు. నెట్ వర్క్ ద్వారా మా పిల్లల ఉద్యోగ రీత్య జీవితాలను ముందుకు నడిపించే వారవుతారని మా గ్రామ అభివృద్ధి దాతలవుతారని ఈ ఊరి ప్రజలు వేడుకుంటున్నారు.






