- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరిపంటకి వేయాల్సిన మందు శనగ పంటకు ఇచ్చిన హనుమాన్ ఫర్టిలైజర్ యజమాని
నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లి పట్టణంలో ఉన్న హనుమాన్ ఫర్టిలైజర్ షాపు వద్దకు నిత్యం రైతులు వందలాదిగా వస్తుంటారు.

దిశ, కొండమల్లెపల్లి : నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లి పట్టణంలో ఉన్న హనుమాన్ ఫర్టిలైజర్ షాపు వద్దకు నిత్యం రైతులు వందలాదిగా వస్తుంటారు. అయితే ఆ షాపు యజమాని ఏ పంటకు ఏమందు ఇస్తే.. అదే మంచిది అని రైతులు నమ్ముతుంటారు. అలాగే కొద్ది రోజుల కిందట నాంపల్లి మండలం పసునూరు గ్రామానికి చెందిన రైతు కామశెట్టి శివ శనగ పంట ఎదుగుదలకు మందులు కావాలని హనుమాన్ ఫర్టిలైజర్ షాపు వద్దకు వచ్చాడు. ఆ షాపు యజమాని వరి పంట సాగుకు వాడే మందులు ఇచ్చారు. దీంతో ఆ రైతుకు చదువు రాకపోవడంతో అది ఏంటో తెలుసుకోలేక వాళ్ళ గ్రామానికి వెళ్లాడు. ఆ తర్వాత ఆ వరిసేనుకు వాడే మందు శనగ పంటకు వాడారు. వాడిన రెండు రోజుల తర్వాత దాదాపు ఎకరంన్నర శనగ పంట మొత్తం వాడిపోయింది. కొండమల్లేపల్లి హనుమన్ ఫర్టిలైజర్ షాప్ వద్దకు వచ్చి లబోదిబోమని తన గోడు వినిపించుకున్నాడు. వాళ్లు ఎవ్వరూ పట్టించుకోకపోగా ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరిస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నా పంట మొత్తం ఎండిపోయింది నా రెండు లక్షల పెట్టుబడి పోయిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక రైతుకు జరగవద్దని తక్షణమే వాళ్లకి నష్టపరిహారం చెల్లించి అధికారులు తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని వాళ్లు వేడుకుంటున్నారు.






