దేవరకొండ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

by Nallavelli.Anjaneyulu |

దేవరకొండ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక ప్ర‌శాంతంగా జ‌రిగింది.దేవరకొండ మండల సర్పంచుల ఫోరం అధ్య‌క్షులుగా మైనంప‌ల్లి స‌ర్పంచ్ కొర్రా రాంసింగ్ నాయ‌క్ ఎన్నిక‌య్యారు.

దేవరకొండ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవం
X

దిశ, దేవరకొండ టౌన్ : దేవరకొండ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక ప్ర‌శాంతంగా జ‌రిగింది. ప‌ట్ట‌ణంలోని స్పోర్ట్స్ భ‌వ‌నం వేదిక‌గా మండ‌ల ప‌రిధిలోని స‌ర్పంచ్ లంద‌రి స‌మ‌క్షంలో ఈ ఎన్నిక నిర్వ‌హించ‌బ‌డింది. దేవరకొండ మండల సర్పంచుల ఫోరం అధ్య‌క్షులుగా మైనంప‌ల్లి స‌ర్పంచ్ కొర్రా రాంసింగ్ నాయ‌క్, ఉపాధ్య‌క్షులుగా తెలుగుప‌ల్లి స‌ర్పంచ్ చాట్ల ర‌మాదేవి రాములు, తాటికోల్ స‌ర్పంచ్ చ‌ల్ల‌మ‌ల విజ‌య్ గౌడ్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కాసారం స‌ర్పంచ్ ముదిగొండ శ్యామ‌ల‌య్య‌, స‌హాయ కార్యదర్శి సూర్యతండా సర్పంచ్ నేనవత్ కవిత లచ్చిరామ్ నాయక్, గౌరవ అధ్యక్షులు నాగవరం, బొడ్డుపల్లి సర్పంచ్ వెంకటేశ్వర రావు, కోశాధికారి వడిత్య తండా సర్పంచ్ రత్లవత్ జగన్ నాయక్, ఈసీ సభ్యులు గోపాల్ నాయక్ (గణ్య నాయక్ తండా సర్పంచ్), నేనవత్ భీముడు నాయక్ (వెంకట్ తండా సర్పంచ్), పల్లా శ్రీకాంత్ రెడ్డి (పడమటి పల్లి సర్పంచ్), కోన్ రెడ్డి శ్రీను (కొండ భీమనపల్లి సర్పంచ్), వడిత్య పద్మ బాలరాజు (శేరిపల్లి సర్పంచ్), ముంత విజయలక్ష్మి మల్లేష్ (ముదిగొండ సర్పంచ్), పాత్లవత్ భారతి ధర్మ (పాత్లవత్ తండా పి సర్పంచ్) గా ఎన్నికయ్యారు. ఎన్నిక అనంత‌రం నూతన కార్యవర్గ సభ్యులకు సమావేశంలో పాల్గొన్న ఇతర సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా అభినందనలు తెలిపారు. కొత్తగా గెలిచిన సర్పంచులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ ఏకగ్రీవ ఎన్నిక మండలంలో సర్పంచ్ ల మధ్య ఉన్న ఐకమత్యాన్ని చాటింది.

Next Story