- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పొంగిన మూసి
ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా బ్రిడ్జిపై నుండి వరద నీరు ఉదృతంగా రావడంతో సోమవారం మూసినది ఉప్పొంగింది.

ఉప్పొంగిన మూసి
నిలిచిపోయిన రాకపోకలు, బారీకేడ్లను ఏర్పాటు చేసిన పోలీసుల
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పొంగుతున్న వాగులు
దిశ,భూదాన్ పోచంపల్లి: ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా బ్రిడ్జిపై నుండి వరద నీరు ఉదృతంగా రావడంతో సోమవారం మూసినది ఉప్పొంగింది. భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పూర్ - మెహర్ నగర్ గ్రామాల మధ్య గల బ్రిడ్జి మీద నీరు ప్రవహించడంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మెహర్ నగర్ నుండి మండల కేంద్రమైన.పోచంపల్లి కి వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. ఈ బ్రిడ్జిపై మూసి నీరు పారుతుండడంతో హైదర్పూర్ భీమనపల్లి మీదుగా సుమారు 8 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇరు గ్రామాల మధ్య బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.బ్రిడ్జి వద్దకు పోలీసులు చేరుకొని బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. మూసి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గొర్రెలు, పశువుల కాపరులు మూసీ నది వైపు వెళ్ళద్దని హెచ్చరికలు జారీ చేశారు.






