మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి..

by Naveena |

గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ సిబ్బంది పని విధానాన్ని వెంటనే రద్దు చేసి, పనికి తగిన వేతనాన్ని సకాలంలో చెల్లించాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు

మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి..
X

దిశ, నడిగూడెం: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ సిబ్బంది పని విధానాన్ని వెంటనే రద్దు చేసి, పనికి తగిన వేతనాన్ని సకాలంలో చెల్లించాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయం ఎదుట పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జీపీ కార్మికులకు ప్రతి నెల 5వ తేదీ లోగా వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కరివిరాల జీపీ సిబ్బంది కి గత 19 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, వారి వేతనాలు అందించి న్యాయం చేయాలని ఆయన కోరారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో సంజీవయ్య కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది చాపల వెంకన్న, సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.

Next Story