- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి హామీ పథకంపై మోడీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది
దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : జాతీయ ఉపాధి హామీ పథకంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటి నుంచి కక్షపూరితంగానే వ్యవహరిస్తుందని

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : జాతీయ ఉపాధి హామీ పథకంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటి నుంచి కక్షపూరితంగానే వ్యవహరిస్తుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ ఆరోపించారు. గురువారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ ప్రభుత్యం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ను రద్దు చేసి, 2025 పేరుతో 197 బిల్లును తెచ్చారని ఈ బిల్లు చట్టమైతే ఉపాధి హామీ చట్టం తల లేని మొండంగా తయారు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వికసిత్ భారత్ 2047 లో భాగం చేస్తూ గ్యారంటీ రోజగార్, అజీవిక మిషన్ (గ్రామీణ) జీ రామ్ జీ 2025 బిల్లు తెచ్చారని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎందుకు రద్దు చేయబోతున్నారని..? ఈ చట్టం ఉపయోగం లేదు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కొత్త బిల్లు ఉన్న ఉపాధిని లేకుండా చేస్తున్నదని, పని దినాలు 125 రోజులకు పెంచుతున్నట్టు చెప్పి 60 రోజులు పని నిషేధం విధించారని, వ్యవసాయ సీజన్ లో రైతులకు కూలీల కొరత లేకుండా అని రైతుల ముసుగు తగిలించారని విమర్శించారు.
ఇప్పటి వరకు 90% ఉపాధి హామీ పనుల నిధులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 10% వాటా దళం ఉండేదని ఇప్పుడు 40 % వాటా రాష్ట్రాలు ఇవ్వాలని చెప్పటం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ఎత్తివేయాలనె కుట్రలో భాగంగానే రాష్ట్రాలపై భారం వేయడమన్నారు. ఆధార్ నిబంధన కచ్చితంగా అమలు చేయడం లేదని సుప్రీం కోర్టుకు స్పష్టం చేసి ఇప్పటికే ఉపాధికి ఆధార్ లింక్ , కొలతలతో వేతనాలు ఇస్తూ రెండు పూటల హాజరు, కేవైసీ చట్ట విరుద్ధంగా పెట్టారని ఆందోళనకు చేస్తుంటే ఇప్పుడు బయమెట్రిక్, ఏఐ, జీపీఎస్ ను చట్ట బద్దం చెయ్యటం కంటే పేదలను ఉపాధి హామీ నుండి తొలగించడం తప్ప మరొకటి కాదని విమర్శించారు. ఉపాధి హామీ నిధులతో ఎస్సీ ,ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం ఇస్తున్న భూముల అభివృద్ధి, కాలనీల అభివృద్ధి, డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, నివాస ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఉపాధి నిధులు మంజూరు చేస్తూ పనులు చేపట్టడం జరిగిందని ఇప్పుడు వాటి ప్రస్తావనే లేకుండా పోయిందని ఇలాంటి అనేక అంశాలు ఉపాధి హామీ చట్టానికి వ్యతిరేకంగా అనేకం ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మౌలిక స్ఫూర్తికి పూర్తిగా నిర్వీర్యం , రద్దు ఇప్పుడున్న ఉపాధి చట్టం ఉందని అన్నారు. ఈ కొత్త బిల్లు ఉపాధిని హరించేదిగా కొద్ది మేరకు ఉన్న ఉపాధి అవకాశాలు కూడా లేకుండా పోతవని అందుకే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టమే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారీ ఐలయ్య, భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ , పోలె సత్యనారాయణ పాల్గొన్నారు.






