- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని చౌటపల్లి గ్రామం వద్ద చోటు చేసుకుంది.

దిశ, మఠంపల్లి : ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని చౌటపల్లి గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య(40) స్వగ్రామం నుంచి మండల కేంద్రమైన మఠంపల్లికి ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా.. మార్గ మధ్యలో హుజూర్ నగర్ నుంచి వేగంగా వచ్చిన లారీ వెనుక వైపు నుంచి బలంగా తన ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. తీవ్ర గాయాలపాలైన నర్సయ్యను అంబులెన్స్ లో హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. చౌటపల్లి ప్రాంతంలో లారీలు అధిక వేగంతో ప్రయాణించడం, రహదారి భద్రతా చర్యలు సరిగ్గా లేకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.






