- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దసరా రోజు వృద్ధులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఓ పూరి రేకుల షెడ్డు ఇల్లు కూలడంతో పేద వృద్ధ దంపతుల ప్రాణాలకు పెను ప్రమాదం తప్పింది.

X
దిశ, తుంగతుర్తి: ఓ పూరి రేకుల షెడ్డు ఇల్లు కూలడంతో పేద వృద్ధ దంపతుల ప్రాణాలకు పెను ప్రమాదం తప్పింది. తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో పేద దంపతులు కొండ వెంకన్న పుల్లమ్మలు మట్టి గోడలతో ఉన్న రేకుల షెడ్డు ఇంటిలో నివాసం ఉంటున్నారు.అయితే ఇంటి లోపల నిద్రిస్తున్న సమయంలో గురువారం తెల్లవారుజామున మట్టి గోడలు కూలి పక్కకు పడ్డాయి. దీంతో వారు తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడి భయంతో బయటికి పరుగులు తీశారు. లేనిపక్షంలో కూలిన మట్టి గోడల మధ్య సజీవ సమాధి అయ్యే పరిస్థితి ఉండేది. ఇల్లు కూలడంతో అందులో నివాసం ఉండలేని పరిస్థితి వృద్ధ దంపతులకు ఏర్పడింది. ఈ విషయమై తుంగతుర్తి మండల తహసీల్దార్ దయానందం దృష్టికి తీసుకెళ్లారు.తమకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
Next Story






