రైతుల ఆనందమే ప్రభుత్వ ధ్యేయం

by Naveena |

దేశానికి వెన్నుముక అయిన రైతన్నల ఆనందమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు

రైతుల ఆనందమే ప్రభుత్వ ధ్యేయం
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : దేశానికి వెన్నుముక అయిన రైతన్నల ఆనందమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం బస్వాపురం ప్రాజెక్ట్ నుండి కాలువ ద్వారా భువనగిరి మండలం గచ్చుబాయి చెరువు నింపి అక్కడి నుంచి పెంచికల్ పహాడ్, రామచంద్రాపురం, కేసారం, బాలంపల్లి, చందుపట్ల, కుమ్మరిగూడెం, వీరవెల్లి గ్రామాల చెరువులకు నీరు విడుదల చేశారు‌. ఈ సందర్భంగా నీటి ప్రవాహాన్ని రైతులతో కలిసి పరిశీలించారు. గంగమ్మ తల్లికి పూజలు చేశారు. సాగునీరు విడుదలతో రైతులలో చాలా ఆనందంగా అనిపిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.

నీటిపారుదల శాఖ మంత్రితో సమావేశం..

హైదరాబాద్ లోని జల సౌదాలో ఇరిగేషన్ అధికారులతో జరిగిన సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్వాపురం ప్రాజెక్ట్ కు నీటి విడుదలపైన చర్చించారు. దీంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు విడుదలపై మంత్రిని కోరారు. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Next Story