- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేనేత రుణాల మాఫీ పై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు : టీటీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా
దిశ, రామన్నపేట : చేనేత కార్మికుల పట్ల, చేనేత సహకార సంఘాల పట్ల, చేనేత పరిశ్రమ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న

దిశ, రామన్నపేట : చేనేత కార్మికుల పట్ల, చేనేత సహకార సంఘాల పట్ల, చేనేత పరిశ్రమ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూపడం తగదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా విమర్శించారు. శనివారం ఆయన దిశతో మాట్లాడారు. సీఎం చేనేత వ్యక్తిగత రుణాలు రూ.33 కోట్లు మాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటికే సంవత్సరం అయిన మాఫీ కాలేదని అన్నారు. అధికారులు డబ్బులు విడుదల చేశామని ప్రకటించినప్పటికీ, చేనేత కార్మికులకు వ్యక్తిగత రుణ మాఫీ అమలుకాకపోవడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సహకార సంఘాలకు గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడం దురదృష్టకరమన్నారు. చేనేత సహకార సంఘాల సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాలకు సంబంధించిన సుమారు రూ.50 కోట్ల క్యాష్ క్రెడిట్ రుణాలను మాఫీ చేసి, సహకార సంఘాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ఎన్నిసార్లు, ప్రభుత్వాన్ని వినతులు చేసినా పట్టించుకోవడం లేదనారు. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే, ముందు రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వేల కోట్ల రూపాయల రుణమాఫీలు చేస్తున్న ప్రభుత్వం, చేనేత పరిశ్రమకు ఉపాధి కల్పించే ఇలాంటి చిన్న రుణాలను మాఫీ చేయకపోవడం పద్మశాలి కమ్యూనిటీపై, చేనేత పరిశ్రమపై ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపునే సూచిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.






