- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు చట్టాలను విరమించుకోవాలి : సీపీఎం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు చట్టాలను వెంటనే విరమించుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్ చేశారు.

దిశ, భూదాన్ పోచంపల్లి : పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను, విద్యుత్ సవరణ బిల్లును, జి రామ్ జి బిల్లును, న్యూక్లియర్ రియాక్ట్ లకు ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం కల్పించడం వంటివి వెంటనే విరమించుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్ చేశారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అధిక లాభాలు గడించేలా నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమని, వీటి మూలాన కార్మికులు సమ్మే హక్కును, ఉద్యోగ భద్రతను కోల్పోతారని పేర్కొన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు ప్రసాదం విష్ణు, సీపీఎం మాజీ డివిజన్ కార్యదర్శి గూడూరు అంజి రెడ్డి, మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు, నెల్లికంటి జంగయ్య, కోట అశోక్, సామ జంగారెడ్డి, కల్కూరి బిక్షపతి, బోయపల్లి పుష్పలత పాల్గొన్నారు.






