- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిల్లులు రాలేదని పాఠశాల గేట్ కు తాళం వేసిన మాజీ సర్పంచ్..!
పాఠశాలకు చేయించిన పనుల బిల్లులు రాలేదని మాజీ సర్పంచ్ పాఠశాల గేట్ కు తాళం వేశారు. ఈ ఘటన వలిగొండ మండలంలోని సంగెం గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, వలిగొండ : పాఠశాలకు చేయించిన పనుల బిల్లులు రాలేదని మాజీ సర్పంచ్ పాఠశాల గేట్ కు తాళం వేశారు. ఈ ఘటన వలిగొండ మండలంలోని సంగెం గ్రామంలోచోటు చేసుకుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చిన విద్యార్థిని, విద్యార్థులు గేటు వద్ద ఉండి పోవాల్సి వచ్చింది. సంగెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాజీ సర్పంచ్ కీసరి రాంరెడ్డి గత ప్రభుత్వం హయాంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో రూ.28 లక్షలతో పని మంజూరు కాగా.. పనులు పూర్తి చేసినప్పటికీ కేవలం రూ.5 లక్షలు మాత్రమే వచ్చాయని.. ఇంకా 23 లక్షల రూపాయలు రావాల్సి ఉందని తెలిపారు. ప్రాథమిక పాఠశాలలో కూడా రూ.5లక్షల పని చేయించినట్టు తెలిపారు. అందులో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని అన్నారు. నేటికి కూడా బిల్లులు రాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆవేదనతో పాఠశాల గేటుకు తాళం వేసినట్టు మాజీ సర్పంచ్ కీసరి రామ్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేయగా.. ఆయన మాజీ సర్పంచ్ రామ్ రెడ్డితో మాట్లాడి బిల్లులు వస్తాయని తెలియజేయడంతో రామ్ రెడ్డి పాఠశాల గేటు తాళం తెరిచారు.






