- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి పదవి పై ఉన్న ధ్యాస అభివృద్ధి పైన పెట్టాలి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పై ఉన్న ధ్యాస మునుగోడు అభివృద్ధి పై లేదని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెల్లమల్ల కృష్ణారెడ్డి విమర్శించారు.

దిశ, మర్రిగూడ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పై ఉన్న ధ్యాస మునుగోడు అభివృద్ధి పై లేదని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెల్లమల్ల కృష్ణారెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని చౌరస్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు ఎమ్మెల్యే అయిన నాటి నుంచి రాజగోపాల్ రెడ్డి నేటి వరకు అభివృద్ధికి నిధులు తేవడం మరచి క్యాంపు కార్యాలయంలో అధికారులతో మీటింగులు పెట్టడానికి మండలాల్లో రోడ్డు షో చేయడానికి పరిమితమయ్యారని ఆరోపించారు. రాష్ట్ర క్యాబినెట్లో జిల్లాకు చెందిన వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కీలక పదవుల్లో మంత్రులుగా ఉన్నారని వారి నుండి మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు తేవటం మరిచి అందరి పై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి పై ధ్యాసమునుగోడు అభివృద్ధి పై పెట్టాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉన్న కార్యకర్తలను మరచి తన వెంట ఉండే వారిని పార్టీలు మారిన వారిని మండల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇవ్వడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షలు మండలాల్లో రోడ్‌షోలు మరువాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. ఇకనైనా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి పై ధ్యాసమరిచి అభివృద్ధి పై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెండు నరసింహారెడ్డి, వెన్నమనేని సుధాకర్ రావు, ఇబ్రహీం, సిరుపంగి శ్రీనివాస్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.






