పేదోడి సొంటింటి కల త్వరలో నెరవేరబోతుంది : మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ, హుజూర్ నగర్ : పేదోడి సొంటింటి కల త్వరలో నెరవేరబోతుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పేదోడి సొంటింటి కల త్వరలో నెరవేరబోతుంది : మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి
X

దిశ, హుజూర్ నగర్ : పేదోడి సొంటింటి కల త్వరలో నెరవేరబోతుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2160 సింగిల్ బెడ్ రూమ్ ఇల్లులు త్వరలో నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఒకే చోట 2160 సింగల్ బెడ్ రూమ్ ఇల్లుల నిర్మాణం పూర్తవటంతో మీ ఉత్తమన్న 13 సంవత్సరాల కృషి ఫలించి అందుబాటులోకి రాబోతున్నాయని ఈ సింగిల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణిలో ఎవరికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా అర్హత మేరకే పారదర్శకంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అధికారులు దరఖాస్తులు స్వీకరించి పరిశీలించి అర్హుల జాబితా తయారు చేయటం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల‌ నిబంధనల మేరకే సింగిల్ బెడ్ రూమ్ ఇల్లులు కేటాయింపు జరుగుతుందని, అర్హులైన అందరకి మంజూరు చేస్తామని ఇందిరమ్మ ఇల్లులు ఇంటి స్థలం ఉన్న వారికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. కానీ సింగల్ బెడ్ రూమ్ ఇల్లులు ఇంటి స్థలం ఉన్న,లేకపోయినా అర్హులైన అందరికీ మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు.

Next Story