- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.

దిశ,గుండాల: గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం బురుజుబావి,గుండాల గ్రామలలో మహిళా సంఘం భవనాలు శంకుస్థాపన, ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసి లబ్ధిదారులకు పట్టుబట్టలు పొట్టేళ్ల కు ఆర్థిక సహాయం, గుండాలలో పప్పు ప్రాసెసింగ్,ఆహార ధాన్యం నిల్వల గోదాం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం,గ్రామాల అభివృద్ధి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడేలా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం స్వయం సహాయక సంఘాల ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల సహకారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు, సర్పంచులు దేవనబోయిన ఐలయ్య, వల్లాల రమేష్, తహసిల్దార్ హరికృష్ణ, ఎంపీడీవో చండీరాణి,ఆలేరు ఏడిఏ శ్రీనివాస్,ఏవో సూరజ్, అండెం సంజీవరెడ్డి,ఈరస రేపు యాదగిరి గౌడ్, ఇమ్మడి దశరథ గుప్తా తదితరులు పాల్గొన్నారు.






