- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాసిడ్ తాగిన విద్యార్థినిని పరామర్శించిన కలెక్టర్
నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల హాస్టల్లో ఉంటూ బీఎస్సీ, బీజెడ్సీ చదువుతున్న హిమశ్రీ అనారోగ్య కారణాలతో యాసిడ్ తాగి నల్గొండ జిల్లా కేంద్రం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల హాస్టల్లో ఉంటూ బీఎస్సీ, బీజెడ్సీ చదువుతున్న హిమశ్రీ అనారోగ్య కారణాలతో యాసిడ్ తాగి నల్గొండ జిల్లా కేంద్రం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సోమవారం కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆస్పత్రికి వెళ్లి హేమశ్రీని పరామర్శించారు. అమ్మాయి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినితో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పారు. విద్యార్థిని తండ్రి వై. వెంకటేశ్వర్లు తో కలెక్టర్ మాట్లాడుతూ సంఘటన జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హిమశ్రీ తండ్రి తన కూతురుకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ పంపించాలని కోరగా, కలెక్టర్ తక్షణమే నిమ్స్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపించేందుకు ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా, అనుముల మండలం హాజారిగూడెం కు చెందిన వై. హిమశ్రీ నల్గొండ ఎన్. జి. కళాశాలలో బీఎస్సీ, బీజేడ్ సి రెండవ సంవత్సరం చదువుతోంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల బి హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న హేమశ్రీ సోమవారం ఉదయం అనారోగ్య కారణంతో యాసిడ్ తీసుకోగా గమనించిన తోటి విద్యార్థుల సమాచారంతో హేమశ్రీని ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిసింది. కలెక్టర్ వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జీజీహెచ్ సూపరింటిండెంట్ నేత నరసింహారావు, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ ఉన్నారు.






