- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NH 65.. ఇక స్మార్ట్ రోడ్డు.. ఏఐతోనూ అనుసంధానం..!
65 హైవేను పూర్తిస్థాయిలో స్మార్ట్ రోడ్డుగా మార్చనున్నారు. రహదారిపై అత్యంత అధునాతనమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూనే వాటిని పూర్తిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానం చేయనున్నారు.

దిశ, నల్లగొండ బ్యూరో : హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి విస్తరణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో హైవే 65 హై సెక్యూరిటీ హైవేగా మారుతుంది. ప్రమాదాలను నియంత్రించడంతో పాటుగా పూర్తి భద్రతా ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రహదారిని ఇప్పటికే ఆరు వరుసలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను అధికారికంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటుంది. జాతీయ రహదారి 65 రానున్న రోజుల్లో సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దారి పొడవున ఎక్కడ ఏం జరిగినా స్పష్టంగా తెలిసేలా డిజిటల్, స్మార్ట్ రోడ్డుగా తయారు కానుంది. విద్యుత్ కాకుండా సోలార్ ద్వారా వీధి దీపాలు ఏర్పాటు , రహదారి పక్కన భద్రత భారీ కేడ్లు, వర్షం నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు.. రోడ్డు మధ్యలో మొక్కలు, వాణిజ్య వ్యాపారాలను ప్రోత్సహించేలా రోడ్డు త్వరలో అందుబాటులోకి రానుంది.
ఆందోల్ మైసమ్మ నుంచి..
ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసలుగా ఉన్న రహదారిని తెలంగాణ పరిధిలోని మల్కాపూర్ వద్ద ఉన్న ఆందోల్ మైసమ్మ దేవాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ దేవాలయం వరకు సుమారు 231.32 కిలోమీటర్ల వరకు ఆరు వరసల రోడ్డుతో విస్తరించనున్నారు..
ఏఐతో అనుసంధానం
65 హైవేను పూర్తిస్థాయిలో స్మార్ట్ రోడ్డుగా మార్చనున్నారు. రహదారిపై అత్యంత అధునాతనమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూనే వాటిని పూర్తిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానం చేయనున్నారు. ఈ విధానంలో రహదారిపై 369 డిగ్రీల కోణంలో పనిచేసే అత్యధిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు ప్రతి కిలోమీటర్ కు ఒకటి చొప్పున మొత్తంగా 231 కెమెరాలను రెండు వైపులా అమర్చేందుకు నిర్ణయించారు. ఈ కెమెరాలు చాలా శక్తివంతంగా పనిచేయడంతో పాటు 24 గంటలు రోడ్లపై ప్రత్యేకమైన నిఘా ఉంచుతాయి. ఆ కెమెరాల ఫలితంగా రహదారి అత్యంత భద్రత గా ఉండడంతో పాటు ప్రమాదాలు కూడా పెద్ద ఎత్తున తగ్గేందుకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
అంచనా రూ.10,391.53కోట్లు..
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించడంతోపాటుగా స్మార్ట్ రోడ్డుగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని కోసం రూ.10,391.53 కోట్లు నిధులు అవసరం అవుతాయని ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారు. అందులో నిర్మాణ వ్యయం రూ.6775.47 కోట్లు, ఇతర వివిధ అవసరాలకు రూ.3,616.06 కోట్లు కావాల్సి ఉంటుందని తెలిపారు. విజయవాడ వెళ్లేందుకు హైవే 65 కీలకం కావడంతో ఈ రోడ్డు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రోడ్డు విస్తరణతో పాటు భద్రతను కూడా పార్టిషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.






