సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారు..భార్యా, భర్త గల్లంతు..!

by Ratna Kumari |   (  Updated:2026-02-08 03:48:54  IST  )

నల్లగొండ జిల్లాలో సాగర్ ఎడమకాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుకేసుకుంది.

సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారు..భార్యా, భర్త గల్లంతు..!
X

దిశ, నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లాలో సాగర్ ఎడమకాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ సంఘటన శనివారం రాత్రి చోటు కేసుకుంది. త్రిపురారం మండలం కంపసాగర్ కు చెందిన భార్య భర్త తల్లం పుల్లయ్య (60), ఆయన భార్య పద్మ (55), ఉదయం కారులో మిర్యాలగూడెం వెళ్లారు. పని అనంతరం సాయంత్రం సమయంలో గ్రామానికి వెళ్తున్నారు. ముకుందాపురంలోని కంపసాగర్ వెళ్లేదారిలో ఉన్న సాగర్ ఎడమకాల్వలోకి కారు దూసుకెళ్లింది. డ్రైవర్ అద్దాలు పగులగొట్టుకుని బయటపడగా, భర్తభర్త కారులోనే ఉండిపోయారు. హుటాహుటినా పోలీసులు ఘటనా స్థలికి చేరకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. అర్ధరాత్రి అయినా సహాయ చర్యలు కొనాసాగించారు. కెమెరాలను కాల్వలోకి పంపించగా నీటిలో కారు ఆచూకీ లభించింది. తల్లం పుల్లయ్య ద్విచక్రవాహనంపై మిర్యాలగూడకు వెళుతుండగా కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. అప్పటి నుంచి చికిత్స పొందుతూ మిర్యాలగూడలో ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా, ఈ ఘటన చోటుచేసుకుంది. సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, హాలియా సీఐ, నిడమనూరు, త్రిపురారం ఎస్ఐలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదం అనుమానాస్పదంగా ఉందంటూ గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story