- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు అదుపు తప్పి బోల్తా..ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు
కారు అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని లోతుకుంట గ్రామ శివారులో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.

దిశ, వలిగొండ : కారు అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని లోతుకుంట గ్రామ శివారులో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ తార్నాకు చెందిన ఐదుగురు వ్యక్తులు కొప్పుల సుదర్శన్ రెడ్డి, కొప్పుల మనోహర్ రెడ్డి, కొప్పుల రేణుక, కొప్పుల కుమార్ రెడ్డి, కొప్పుల క్రాంతికుమార్ రెడ్డి లు సుర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం పర్షియపల్లి గ్రామంలో మృతి చెందిన బందువు అంత్యక్రియల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామ శివారులో కారుకు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించే క్రమంలో కారు అదపుతప్పి పల్టీ పడిన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఐదుగురు బాదితులను 108 వాహనంలో ముగ్గురిని, ప్రైవేటు వాహనంలో ఇద్దరిని హైదరాబాద్ లో ని ప్రైవేటు ఆసుపత్రి చికిత్స కోసం తరలించినట్లుగా 108 సిబ్బంది తెలిపారు.






