- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
వరి పొలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.. హత్యచేశారా..?
దిశ, చింతపల్లిః వరిపొలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నట్టనడుమ వరి పొలంలో మృతదేహం ఉండటంతో కచ్చితంగా ఎవరో హత్యచేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మండల పరిధిలోని ప్రశాంతపురం తండా శివారులో హైవే పక్కన ఉన్న కేతావత్ చంద్రు తండ్రి రెడ్యా వ్యవసాయ వరి పొలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఎస్సై బి యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం మృతుడి వయస్సు 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు ఉంటుంది. అయితే మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకుండా వరి పొలంలో చనిపోయిఉన్నాడు. మరణించిన వ్యక్తి కుడి చేతి పైన యాదవ్ జి అని టాటూ వుంది. ప్రశాంతపురితండా గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ అయినా కేతావత్ లచ్చిరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మృతుడి గురించి వివరాలు తెలిసిన వాళ్ళు సంప్రదించవలసిన చిరునామా చింతపల్లి ఎస్సై బి. యాదయ్య 8712670230, సిఐ ఏ. నవీన్ కుమార్ నాంపల్లి 8712670156 ఈ నెంబర్లకు సంప్రదించగలరు.