వైజాగ్ కాల‌నీలో ఫిష‌రీస్ ఎన్నిక‌ల‌పై ఉద్రిక్త‌త‌

by Ratna Kumari |

మండ‌ల ప‌రిధిలోని వైజాగ్ కాల‌నీలో జ‌రుగుతున్న ఫిష‌రిస్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

వైజాగ్ కాల‌నీలో ఫిష‌రీస్ ఎన్నిక‌ల‌పై ఉద్రిక్త‌త‌
X

దిశ‌, నేరేడుగొమ్ము : మండ‌ల ప‌రిధిలోని వైజాగ్ కాల‌నీలో జ‌రుగుతున్న ఫిష‌రిస్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో బోగ‌స్ ఓట్లు ఉన్నాయ‌ని ఆరోపిస్తూ.. ఎన్నిక‌ల‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని కొన్ని వ‌ర్గాలు డిమాండ్ చేస్తూ.. నామినేష‌న్ కేంద్రం వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. దీంతో వైజాగ్ కాల‌నీలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. సీఐ బీసన్న, ఎస్‌ఐ కే. నాగేంద్రబాబు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. అధికార యంత్రాంగం పరిస్థితిని సమీక్షిస్తూ ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Next Story