- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్ కు సంపూర్ణ మద్దతు : మంత్రి పొంగులేటి
ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుందని రెవెన్యూ ,గృహ నిర్మాణ ,సమాచార ,పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

దిశ, నకిరేకల్ టౌన్ : ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుందని రెవెన్యూ ,గృహ నిర్మాణ ,సమాచార ,పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం నకిరేకల్ పట్టణంలో ఆపరేషన్ సింధూర్ మద్దతు తెలుపుతూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉగ్రవాదానికి కులం, మతం, దేశం లేదనీ, గతంలో పాకిస్తాన్లోనూ, భారత్లోనూ ప్రధానమంత్రులను చంపిన విషయాన్ని గుర్తుచేశారు. ఆక్రమిత కాశ్మీరు అడ్డాగా చేసుకుని పాకిస్థాన్ పాలకులు, ఉగ్రవాదులు భారత్లో నరమేధాన్ని సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సహనానికి మారుపేరైన భారతదేశానికి ఉగ్రవాదం నుంచి శాశ్వతంగా విముక్తి జరగాలని ఆకాంక్షించారు. అందరు సమైక్యంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మిర్యాలగూడ తుంగతుర్తి ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామిల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ , డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.






