- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెట్ టెన్షన్.. సెలవులకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులు
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పాస్ అవ్వాల్సిందేనని తేల్చి చెప్పిన నేపథ్యంలో టీచర్లకు టెట్ టెన్షన్ పట్టుకుంది.

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పాస్ అవ్వాల్సిందేనని తేల్చి చెప్పిన నేపథ్యంలో టీచర్లకు టెట్ టెన్షన్ పట్టుకుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష తో విద్య బోధనకు ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితులు కల్పిస్తున్నాయి. సర్వీస్ లో ఉన్న టీచర్లు పెద్ద సంఖ్యలో టెట్కు దరఖాస్తు చేశారు. ఉద్యోగులు నిబంధనల ప్రకారం ఏదైనా పరీక్షకు హాజరవుతుంటే సెలవు ఇవ్వాల్సి ఉంటుంది అయితే పెద్ద సంఖ్యలో టీచర్లు సెలవు పెడితే పాఠశాలల్లో బోధన వెనకబడి విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనిమిది వేల మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నారు. సగభాగానికి పైగా ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత లేనట్లు విశ్వసనీయ సమాచారం. అయితే టెట్ పరీక్ష జనవరి నెలలో నిర్వహించే అవకాశం ఉండడంతో అప్పటికి విద్యార్థులకు సిలబస్ పూర్తయ్యే అవకాశం తక్కువగా ఉంది. పదో తరగతి పరీక్షలు కూడా మరో 45 రోజులు గడువు మాత్రమే ఉండే అవకాశం ఉంది.
కష్టంగానే సన్నద్ధత :
ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించే టెట్ పరీక్ష కోసం సన్నద్ధం కావడం వారికి కష్టతరంగానే మారింది. తాజాగా బీఈడీ ఉత్తీర్ణులైన అభ్యర్థుల కన్నా సర్వీస్ టీచర్లు టెట్ అంటేనే ఆందోళన చెందుతున్నారు. కొన్నేళ్లుగా జనరల్ కేటగిరిలో టెట్ 2 పేపర్ 35% మాత్రమే పాస్ అవుతున్నారు. బీఈడీ అర్హతతో ఉండే ఈ పేపర్ ను స్కూల్ అసిస్టెంట్లు కూడా రాస్తారు. పేపర్ 1 ప్రాథమిక స్కూల్లో పనిచేసే ఎస్జీటీలు రాస్తారు. టిటిసి, ఇతర డిప్లమా కోర్సులు ఈ పరీక్షకు అర్హతగా ఉంటుంది. అయితే బీడీ ఉన్న ప్రాథమిక టీచర్లు కూడా పేపర్ 2 రాయవచ్చు. వీరిలో చాలామంది పేపర్ 1, 2 కూడా రాయనున్నారు. స్కూల్ అసిస్టెంట్లు మాత్రం ప్రిపేర్ అవుతున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి సెకండరీ గ్రేట్ క్లాసుల వరకు సర్దుతూ ప్రశ్నపత్రం ఉంటుంది. ముఖ్యంగా సైకాలజీ, విద్యారంగంలో వస్తున్న మార్పులు, విద్యార్థి మనోవిశ్లేషణ, ఆధునిక బోధన విధానంతో పాటు అనేక ఇతర అంశాలను సిలబస్ ఉండనున్నట్లు నిపుణుల అంచనా. ఈ పరీక్షకు సరైన సన్నద్ధత ఉంటే తప్ప పాస్ అవ్వడం తేలిక కాదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు బోధన వృత్తిలో ఇప్పటికీ ఏదో ఒక సబ్జెక్టుకు మాత్రమే టీచర్లు అంకితమై బోధిస్తుండగా టెట్ పరీక్షలో అన్ని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు రావడంతో ఈ పరీక్షలో ఇతర సబ్జెక్టులో ప్రశ్నలను సాధన చేయడం కష్టతరంగానే భావిస్తున్నారు. ఈ టెట్ పరీక్షకు సన్నద్ధం కావాలంటే సుమారు రెండు నెలలకు పైగానే ప్రిపేర్ కావాల్సి ఉంటుందని ఉపాధ్యాయ వర్గాల నుంచి వినపడుతున్న సమాచారం. ఏదేమైనా సుప్రీంకోర్టు ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి అని ఇచ్చిన తీర్పు మాత్రం ఉపాధ్యాయ లోకానికి కొంత ఇబ్బందికరంగానే మరిందని చెప్పవచ్చు.
ఇప్పటివరకు ఎవరు సెలవు పెట్టలేదు : బొల్లారం బిక్షపతి, డిఈఓ, నల్లగొండ
టెట్ పరీక్ష కోసం ఇప్పటివరకు జిల్లాలో ఉపాధ్యాయులు ఎవరు సెలవు పెట్టలేదు. జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో 8000 మంది ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తున్నారు. టెట్ పరీక్ష తేదీ ప్రకటించిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులతో విద్యాబోధన సక్రమంగా సాగుతుంది.






