లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం

by velandi.Saikiran |

ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని తుంగతుర్తిలో ఉపాధ్యాయులను సన్మానించింది

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం
X

దిశ,తుంగతుర్తి: ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని తుంగతుర్తిలో ఉపాధ్యాయులను సన్మానించింది లయన్స్ క్లబ్. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ ఎర్ర హరికృష్ణ,రిటైర్డ్ ఉద్యోగులు కేతిరెడ్డి రవీందర్ రెడ్డి,కాసం మల్లయ్య,తాళ్లపల్లి యాదగిరి,గుజ్జ రామచంద్రయ్య,బండారు రామచంద్రయ్య,అబ్బయ్య,మిట్టగడుపుల పురుషోత్తం, మహిళా ఉపాధ్యాయురాలు ఎల్లబోయిన కృష్ణవేణి,తాళ్లపెళ్లి విజయలక్ష్మిలు సన్మానం పొందిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా క్లబ్ ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని వర్ణించారు. కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి గుండగాని రాము,సభ్యులు ఓరుగంటి సుభాష్,పులుసు వెంకటనారాయణ,టైలర్ గిరి,వీరబోయిన రాములు, ఎనగందుల శ్రీను,ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఈగ నాగన్న, జిల్లా ఉపాధ్యక్షులు బండారు దయాకర్,తదితరులు పాల్గొన్నారు.

Next Story