- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధానోపాధ్యాయురాలి పై ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడు.. మానసికంగా వేధిస్తున్నారంటూ!?
ప్రధానోపాధ్యాయురాలిపై అదే పాఠశాలకు చెందిన ఉపాద్యాయుడు కె.జగ్రామ్ శనివారం జిల్లా విద్యాధికారులకు ఫిర్యాదు చేశారు.

దిశ, చింతపల్లి: చింతపల్లి మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్ఎస్)లో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయురాలిపై అదే పాఠశాలకు చెందిన ఉపాద్యాయుడు కె.జగ్రామ్ శనివారం జిల్లా విద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. తనను మానసికంగా వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పాఠశాల సిబ్బంది ముందు వివిధ సందర్భాల్లో ఉపాద్యాయుడు జగ్రామ్ పై విషం చిమ్మినట్లు మాట్లాడేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా ఉపాద్యాయుల కంటే మీరే రౌడీలా ప్రవర్తిస్తున్నారని పలుమార్లు సూటిపోటి మాటలతో వేధించె వారని ఉపాధ్యాయుడు చెప్పుకొచ్చాడు. నిత్యం తనమీదనే ఫోకస్ పెడుతూ ఇబ్బందులకు గురి చేసినట్లు తెలిపారు.
ఎప్పుడైనా అత్యవసర సమయంలో సెలవు కోసం దరఖాస్తు పెట్టుకున్న సెలవు ఇచ్చేది కాదని చెప్పుకొచ్చారు. అయితే ఉపాద్యాయుడు జగ్రామ్ చిరకాల మిత్రుడైన సంజీవ కుమార్ పదవీ విరమణ కార్యక్రమానికి వెళ్ళడానికి సెలవు ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా మిగతా ఉపాధ్యాయులకైన సెలవు మంజూరు చేస్తా గాని మీకు మాత్రం ఇవ్వనని వివిధ అభ్యంతరకరమైన పదజాలం వాడి ఇబ్బందులు పెట్టేవారని తెలిపారు. తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ప్రధానోపాధ్యాయురాలి పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులకు ఉపాద్యాయుడు కె.జగ్రామ్ ఫిర్యాదు చేశారు.






