- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేరేడుచర్లలో 15 కు 15 గెలవడమే టార్గెట్ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మున్సిపాలిటీ ఎన్నికలలో నేరేడుచర్ల మున్సిపాలిటీ నుంచి 15 వార్డులకు 15 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవడమే టార్గెట్ అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, నేరేడుచర్ల : మున్సిపాలిటీ ఎన్నికలలో నేరేడుచర్ల మున్సిపాలిటీ నుంచి 15 వార్డులకు 15 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవడమే టార్గెట్ అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నేరేడుచర్ల పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో కీలక నాయకులతో సమావేవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేరేడుచర్లతో పాటు హుజూర్ నగర్ లో 28 కి 28 , కోదాడలో 35కు 35 గెలిస్తేనే తాను గెలుపుగా భావిస్తానని వ్యాఖ్యానించారు.ఎన్నికల్లో గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. ఇప్పటికే ప్రతి వార్డులో సర్వేలు నిర్వహించాలని 15 గెలిచేందుకు ముందంజలో ఉన్నామని అన్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో 15 వార్డులకు15 వార్డులు గెలిస్తే మీ వార్డులో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని.. వారికి పోటీ చేసిన అభ్యర్థులకు మంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే పనులు చేశామని గుర్తు చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఈ రెండేళ్లలో విద్య వైద్యం అగ్రికల్చర్ ఇంటర్నల్ రోడ్లు లిఫ్ట్ ఇరిగేషన్ లో చేపట్టిన పనుల గురించి వివరించారు. లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా కృష్ణా నది వెంట ఉన్న మండలాలకు అవసరం ఉన్నచోట లిఫ్టులను ఏర్పాటు చేస్తామన్నారు. తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 800 రోజులు అవుతున్నాయని.. ఇంతవరకు ఒక్క రోజు కానీ సెలవు తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన పనులను చరిత్రలో మర్చిపోని విధంగా చేయిస్తామన్నారు. ప్రజలు గర్వపడే విధంగా పనిచేస్తానన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడిపాటి నరసయ్య సిపిఐ పార్టీ నాయకులు ధనుంజయ నాయుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనతం చిన్న వెంకటరెడ్డి నూకల సందీప్ రెడ్డి భూక్య గోపాల్ బచ్చలకూరి ప్రకాష్ నాగయ్య జితేందర్ రెడ్డి సురేష్ రెడ్డి వీరయ్య రమేష్ బాబు ఉన్నారు.






