మై హోం సిమెంట్ పరిశ్రమపై చర్యలు తీసుకోండి..

by Naveena |

గత రెండు సంవత్సరాలుగా మేళ్లచెరువు గ్రామపంచాయతీకి ఎటువంటి పన్ను చెల్లించకుండా నడుస్తున్న మైహోమ్ సిమెంట్స్ పరిశ్రమ యూనిట్-4 ప్లాంట్ సిమెంటు ఉత్పత్తిని వెంటనే నిలిపివేయాలని న్యాయవాది క్రమతం నాగార్జున పంచాయతీ కార్యదర్శి షేక్ ఫరీద్ కు ఫిర్యాదు చేశారు

మై హోం సిమెంట్ పరిశ్రమపై చర్యలు తీసుకోండి..
X

దిశ ,హుజూర్ నగర్: గత రెండు సంవత్సరాలుగా మేళ్లచెరువు గ్రామపంచాయతీకి ఎటువంటి పన్ను చెల్లించకుండా నడుస్తున్న మైహోం సిమెంట్స్ పరిశ్రమ యూనిట్-4 ప్లాంట్ సిమెంటు ఉత్పత్తిని వెంటనే నిలిపివేయాలని న్యాయవాది క్రమతం నాగార్జున పంచాయతీ కార్యదర్శి షేక్ ఫరీద్ కు ఫిర్యాదు చేశారు. మై హోం సిమెంట్ పరిశ్రమ నుంచి గ్రామపంచాయతీ పన్ను వసూలు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ..గ్రామంలోని సామాన్య ప్రజల నుండి ముక్కు పిండి పంచాయతీ పన్ను వసూలు చేస్తున్న గ్రామపంచాయతీ అధికారులు ఎందుకు మైహోం సంస్థ నుంచి పన్ను వసూలు చేయకపోవడం లేదన్నారు.

అలాగే దీని వెనుక ఆంతర్యమేమో చెప్పాలని డిమాండ్ చేశారు. యూనిట్-4 సిమెంట్ ప్లాంట్ కు అనుమతులు జారీ చేసిన గ్రామపంచాయతీ రెండు సంవత్సరాలుగా కనీసం గ్రామపంచాయతీ పన్ను వసూలు చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రూ.1500 కోట్ల విలువచేసే మైహోమ్ సిమెంట్స్ యూనిట్-4 ప్లాంట్ కు గ్రామపంచాయతీ పన్ను ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా పన్ను వసూలు చేయకపోవడంపై.. గ్రామపంచాయతీ అధికారుల తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మైహోం సిమెంట్స్ సంస్థ గ్రామపంచాయతీ పన్ను చెల్లించకపోవడం వల్లనే మేళ్లచెరువు గ్రామపంచాయతీ అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం మైహోమ్ సిమెంట్స్ సంస్థ నుండి గ్రామపంచాయతీ పన్ను వసూలు చేయాలని ఆయన గ్రామపంచాయతీ అధికారులను కోరారు. పన్ను చెల్లించేంత వరకు మైహోమ్ సిమెంట్ పరిశ్రమ సిమెంట్ ఉత్పత్తిని వెంటనే నిలుపుదల చేయాలని ఆయన కోరారు.

Next Story