- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వగ్రామ సేవకే ఎస్సై .. సర్పంచ్ కోసం ఉద్యోగానికి రాజీనామా
దిశ, కోదాడ : స్వగ్రామ ప్రజల సేవకే ప్రాధాన్యం ఇస్తూ కోదాడ టౌన్ ఎస్సై పులి వెంకటేశ్వర్లు తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంకా ఐదు నెలల సర్వీస్

X
దిశ, కోదాడ : స్వగ్రామ ప్రజల సేవకే ప్రాధాన్యం ఇస్తూ కోదాడ టౌన్ ఎస్సై పులి వెంకటేశ్వర్లు తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంకా ఐదు నెలల సర్వీస్ మిగిలి ఉండగానే గుడిబండ గ్రామ సర్పంచ్ పదవీకి పోటీ చేసేందుకు ఆయన స్వచ్ఛంద విరమణ (వీఆర్ఎస్) కు అర్జీ సమర్పించారు. పుట్టి పెరిగిన ఊరిని ముందుకు తీసుకెళ్లడం, గ్రామీణ సమస్యలను పరిష్కరించడం నా జీవిత ధ్యేయం. ప్రజలకు మరింత చేరువ కావాలన్న ఆలోచనతోనే సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను అని వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన నిర్ణయాన్ని పోలీసులు ఉన్నతాధికారులు ప్రశంసించారు. గ్రామ పెద్దలు, యువత ఆయన ముందడుగుకు మద్దతు తెలుపుతూ అభినందనలు తెలియజేశారు. స్వగ్రామ అభివృద్ధికి ‘ఉద్యోగం కంటే సేవే గొప్పది’ అని నిలబెట్టిన ఎస్సై వెంకటేశ్వర్ల నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Next Story






