- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యక్తి అనుమానస్పద మృతి..
మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

దిశ, మేళ్లచెరువు: మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మండల కేంద్రం నుంచి చౌటపల్లి వెళ్లే మార్గంలోని పొలాల్లో ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువుకు చెందిన చిలకంటి గోపి (తండ్రి: వెంకటేశ్వర్లు) సుతార్ పనిలో హెల్పర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం ఇంటి నుంచి పనిమీద వెళ్లిన గోపి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రంతా గాలించారు. ఆదివారం సాయంత్రం చౌటపల్లి మార్గంలోని పొలాల్లో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి చూడగా.. అది గోపిదేనని బంధువులు గుర్తించారు. ఇటీవల నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోపి వడదెబ్బకు మృతి చెందినట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య రమణ, కుమారుడు వెంకటేశ్వర్లు, కుమార్తె రేణుక ఉన్నారు. గోపి మృతి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.






