- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
40 ఏళ్ల కాంగ్రెస్ సేవలకు ప్రతిఫలం సస్పెన్షన్
దిశ, శాలిగౌరారం : గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన తన కు కాంగ్రెస్ పార్టీలో లభించిన ప్రతిఫలం సస్పెన్షనేనా అని శాలిగౌరారం మండలం భైరవుని బండ గ్రామానికి చెందిన నాయకులు,శాలిగౌరారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరిగె నరసింహ వాపోయారు

దిశ, శాలిగౌరారం : గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన తన కు కాంగ్రెస్ పార్టీలో లభించిన ప్రతిఫలం సస్పెన్షనేనా అని శాలిగౌరారం మండలం భైరవుని బండ గ్రామానికి చెందిన నాయకులు,శాలిగౌరారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరిగె నరసింహ వాపోయారు.గత సర్పంచ్ ఎన్నికల్లో భైరవుని బండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రెబల్ గా పోటీ చేసిన అనే కారణంతో దళితుడు నైన తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జిల్లా అధ్యక్షులు పున్న కైలాస్ నేత ప్రకటించడం బాధాకరమని అన్నారు. శాలిగౌరారం మండలం తో పాటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నేతలు సర్పంచులుగా వార్డ్ మెంబర్లుగా రెబల్ గా పోటీ చేశారని, అయినా ఎవ్వరిని సస్పెండ్ చేయకుండా దళితుడైన తననే సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత 40 నుంచి కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి పార్టీ బలోపేతానికి నిర్విరామంగా కృషి చేశానని,2004లో భైరవుని బండ గ్రామంలో శివాలయానికి ఎండోమెంట్ వచ్చేలా చేశానని, జడ్పీ చైర్మన్ నారాయణ రెడ్డి ద్వారా గ్రామానికి ఐమాక్స్ లైట్లు, వాటర్ ట్యాంకు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేలా చూసానని అన్నారు.
గతంలో రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్లు వేయించడంలో తన వంతు పాత్ర పోషించానని, సీపీఎం- కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగిన గొడవల్లో కేసుల పాలయ్యానని తెలిపారు. 1994 లో సామూహిక జీవనాధార పథకం ద్వారా బీసీ వర్గాలకు సౌకర్యాలు కల్పించడంలో, ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం అప్పటి కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి ద్వారా కలెక్టర్ సిసోడియా పంపించి సగం బియ్యం సగం నగదు విధానంలో టెండర్ విధానం ద్వారా రెండు లక్షల నష్టాన్ని భరించి కూడా కమ్యూనిటీ హాల్ నిర్మించానని అన్నారు. అలాంటిది ఎలాంటి ఆధారాలు లేకుండా కొందరు వ్యక్తులు చెప్పిన తప్పుడు సమాచారంతో దళితుడిని, మాదిగ సామాజిక వర్గానికి చెందిన తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం బాధాకరమని అనా తన ఆవేదనను వెలిబుచ్చారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీ చామల కిరణ్,ఎమ్మెల్యే మందుల సామెల్, మండల అధ్యక్షులు కందాల సమరం సూచనల మేరకు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరిగె యాదయ్య ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించానని,తెలంగాణ ఉద్యమకారులు,బీసీ బిడ్డవైన మీకు డిసిసి అధ్యక్ష పదవి రావాలని కోరుకున్న వారిలో నేను కూడా ఉన్నానని,.. నా మీద విధించిన సస్పెన్షన్ ను పరిశీలించి రద్దు చేయాలని జిల్లా అధ్యక్షులు పున్నా కైలాస్ ను, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరారు.






