- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయస్థాయిలో మెరిసిన సూర్యాపేట విద్యార్థులు
by Muthe.Rajitha |
సూర్యాపేట పట్టణానికి చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో మెరిశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : సూర్యాపేట పట్టణానికి చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో మెరిశారు. పట్టణంలోని అశోక్ మాస్టర్స్ ట్యుటోరియల్స్ కు చెందిన విద్యార్థులు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్ -2025 లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ట్యుటోరియల్స్ కు చెందిన కూనూరీ అనుజ, కూనూరీ శాన్వితలు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రాలు పొందారు. నేషనల్ స్థాయిలో జిల్లా పేరును నిలబెట్టిన అనూజ, శాన్వితలను ఎమ్మెల్యే, మాజీ మంత్రి జి. జగదీశ్ రెడ్డి అభినందించారు.
చిన్నారులతోపాటు వారికి గైడెన్స్ ఇచ్చిన అశోక్ మాస్టర్స్ ట్యుటోరియల్స్ డైరెక్టర్ మడ్డి అశోక్ కుమార్ ను కూడా జగదీశ్ రెడ్డి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు బీఆర్ఎస్ నాయకులు షీలా శంకర్, గట్టికల్ మాజీ ఎంపీటీసీ సభ్యులు మడ్డి విజయ్ కుమార్ పాల్గొన్నారు.
Next Story






