- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్వారీలో పడి వ్యక్తి మృతి
క్వారీలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, భూదాన్ పోచంపల్లి : క్వారీలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పులివెందుల గ్రామానికి చెందిన వీరబోయిన అశోక్ కుమార్ (31) రెండు నెలల క్రితం నుండి పోచంపల్లి మండలంలోని పిల్లాయిపల్లి గ్రామంలో గల శివగంగ క్రషర్ క్వారీలో సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం గ్రానైట్ వర్క్ చేస్తుండగా అదుపుతప్పి కాలుజారి క్వారీలో పడటంతో తలకు తీవ్రంగా గాయమైంది.
వెంటనే అశోక్ కుమార్ ను చికిత్స నిమిత్తం వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. క్వారీ నిర్లక్ష్యం కారణంగానే అశోక్ కుమార్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే ఈ విషయం బయటికి సోకకుండా రహస్యంగా సెటిల్మెంట్ చేసుకున్నారని సమాచారం. మృతుడి తండ్రి వీరబోయిన రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.






