- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యుని పాదాలను తాకిన సూర్యకిరణాలు..
by Batti.Sumithra |
జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలోని శ్రీ అఖండ జ్యోతిస్వరూప ద్వాదశ ఆదిత్య ప్రధాన ఆలయంలోని సూర్య నారాయణ స్వామి పాదాలను సూర్య కిరణాలు తాకిన దృశ్యం భక్తులను కనువిందు చేసింది.

X
దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలోని శ్రీ అఖండ జ్యోతిస్వరూప ద్వాదశ ఆదిత్య ప్రధాన ఆలయంలోని సూర్య నారాయణ స్వామి పాదాలను సూర్య కిరణాలు తాకిన దృశ్యం భక్తులను కనువిందు చేసింది. ఆదివారం సూర్య భగవానునికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో భక్తులు ప్రతివారం మహాసౌరయాగం, అభిషేకాలు తదితర పూజలు నిర్వహిస్తారు. సూర్యోదయ సమయంలో ప్రాతఃకాల పూజ సమయంలో సూర్య కిరణాలు స్వామి వారి పాదాలను తాకినాయని ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ తెలిపారు.
Next Story






