వేసవిలో దొంగల బెడద.. పోలీసులను అలర్ట్ చేసిన డీఎస్పీ

by Naveena |

పోలీసులు మండలంలోని ప్రజలకు అందుబాటులో ఉండి తమ సేవలను అందించాలని సూర్యాపేట డిఎస్పి పార్థ సారథి అన్నారు.

వేసవిలో దొంగల బెడద.. పోలీసులను అలర్ట్ చేసిన డీఎస్పీ
X

దిశ, పెన్ పహాడ్ : పోలీసులు మండలంలోని ప్రజలకు అందుబాటులో ఉండి తమ సేవలను అందించాలని సూర్యాపేట డిఎస్పి పార్థ సారథి అన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ ను సీఐ రాజశేఖర్ తో కలిసి సందర్శించి రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం వేసవికాలం అయినందున దొంగల బెడద ఎక్కువ ఉంటుందని ,కావున సిబ్బంది ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహించాలన్నారు. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించాలని సిబ్బందికి తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో అపరిచితులు తారసపడినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాలని ప్రజలకు సూచించారు. స్టేషన్ కు అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కస్తాల గోపికృష్ణ, పోలీస్ స్టేషన్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Next Story