- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూట్రిషన్ ఫుడ్ పై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి : ప్రధానోపాధ్యాయులు కే.కోటీశ్వర్ రెడ్డి
నూట్రిషన్ ఫుడ్ పై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కే. కోటేశ్వర్ రెడ్డి అన్నారు.

దిశ, చండూరు : నూట్రిషన్ ఫుడ్ పై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కే. కోటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం పాఠశాలలో విద్యార్థుల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్ట్వల్ 2026 నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కోటీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయ వంటకాలు ఆరోగ్యాన్ని పెంచుతాయని అన్నారు. విద్యార్థులు ఆధునిక వంటలు, సాంప్రదాయక వంటలు రుచికరంగా తయారు చేశారని అభినందించారు. వృత్తి, విద్యా కోర్సులు, బ్యూటీ వెల్ నెస్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ విద్యలో భాగంగా ఉపాధ్యాయులు కే. శైలజ, ఎస్ కె ఫిరదోస్ తరన్నుమ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడిందన్నారు. ఫుడ్ కార్వింగ్, నాప్కిన్ ఫోల్డింగ్, టేబుల్ సెటప్, మొదలైన అంశాలను విద్యార్థులు ప్రదర్శించారు.






