- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి : కలెక్టర్ చంద్రశేఖర్
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి : కలెక్టర్ చంద్రశేఖర్
హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, నిరంతరం అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి .చంద్రశేఖర్ సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లను ఆదేశించారు.

X
దిశ, మిర్యాలగూడ : హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, నిరంతరం అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి .చంద్రశేఖర్ సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లను ఆదేశించారు. బుధవారం అయన మిర్యాలగూడ పట్టణంలోని బాలికల సంక్షేమ హాస్టల్ (ఏ) ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ గదులు, స్టోర్, కిచెన్, విద్యార్థులకు అందించే భోజనం, బియ్యం, ఇతర వంట సామాగ్రిని తనిఖీ చేశారు. మెనూ, స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి బాగా చదువుకోవాలని చెప్పారు. స్వీయ రక్షణ పై సూచనలు చేశారు. హాస్టల్లో టీఎస్ఈ ఐడబ్ల్యుసి నిధులద్వారా హాస్టల్ లో మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థినిలకు నిర్వహించాలని ఆదేశించారు.
Next Story






