- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా సోషల్ వెల్ఫేర్ పాఠశాల పూర్వ విద్యార్థినిల ఆత్మీయ సమ్మేళనం!
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలకు చెందిన 2006-2007 పదోతరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల

దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలకు చెందిన 2006-2007 పదోతరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2002 నుంచి 2007వరకు హాస్టల్‌లో చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాడు ఉపాధ్యాయులతో ఉన్న అనుబందాన్ని కొనియాడుతూ వారిని శాలువ, పూల మాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ...నాడు హాస్టల్లో ఉండి చదువుకుని నేడు జీవితంలో రాణిస్తున్న విద్యార్థినిలను అభినందించారు. ప్రతి యేట ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుని భాదైనా సంతోషమైనా అందరూ పంచుకోవాలన్నారు. అనంతరం స్నేహితురాళ్ళంతా తమ ప్రస్తుత స్థితిగతులను ఒకరితో ఒకరు పంచుకుని ఆనందగా గడిపారు. ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు జోనల్ ఆఫీసర్ అరుణకుమారి, గణేష్, రమణమ్మ, కవితరాణి, వసంత, రేణుక, అంజయ్య, కరుణాకర్ రెడ్డి, రవి, విద్యార్ధినిలు రమాదేవి, రోజా, శైలజ, ఇందు తదితరులు పాల్గొన్నారు.






