నూత‌న సంవ‌త్స‌ర‌ వేడుకలకు ముందు కట్టు దిట్టమైన చర్యలు : సీఐ శివశంకర్‌

by Ratna Kumari |

దిశ‌, కోదాడ : డిసెంబర్‌ 31 సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామ‌ని కోదాడ‌ పట్టణ సీఐ శివశంకర్‌ తెలిపారు.

నూత‌న సంవ‌త్స‌ర‌ వేడుకలకు ముందు కట్టు దిట్టమైన చర్యలు :  సీఐ శివశంకర్‌
X

దిశ‌, కోదాడ : డిసెంబర్‌ 31 సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామ‌ని కోదాడ‌ పట్టణ సీఐ శివశంకర్‌ తెలిపారు. మంగళవారం పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.ఈ సందర్భంగా పట్టణవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో సుమారు 100 వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. మైనర్‌ డ్రైవింగ్‌, త్రిబుల్‌ రైడింగ్‌, వాహనాలకు సరైన పత్రాలు లేకపోవడం, నెంబర్‌ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో యువత నిర్లక్ష్యంగా వాహనాలు నడపకుండా, ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి తనిఖీలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు.పట్టణంలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీస్‌ శాఖ అప్రమత్తంగా ఉందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీఐ శివశంకర్‌ కోరారు. ఆయన వెంట పట్టణ ఎస్ఐ హనుమాన్ నాయక్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, ఏఎస్ఐలు షేక్ ఖయ్యూం, శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ బాల్తు శ్రీనివాస్ పాల్గొన్నారు.

Next Story